ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలకో జీ20 దేశాలు 6.9 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు పేర్కొంది. 2009 ఆర్థిక సంక్షోభం సమయంలో నమోదైన -1.6 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని స్పష్టం చేసింది.
దేశాల వారీగా..
ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఏప్రిల్-జూన్ మధ్య భారత జీడీపీ అసాధారణ స్థాయిలో 25.2 శాతం పతనమైనట్లు ఓఈసీడీ తెలిపింది. తర్వాతి స్థానాల్లో బ్రిటన్ (-20.4 శాతం), మెక్సికో (-17.1 శాతం) ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వృద్ధి రేటు 9.1 శాతం క్షీణించినట్లు వివరించింది.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో.. జీ20 దేశాల్లో చైనా మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు తెలిపింది ఓఈసీడీ. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 11.5 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ బకాయిలు రూ.లక్షన్నర కోట్లు