దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు స్థానికంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వారానికి 1.25 బిలియన్ డాలర్ల(రూ.9 వేల కోట్లకు పైగా) నష్టం వాటిల్లోచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుత అంక్షలు మే చివరి వరకు కొనసాగిస్తే.. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల నష్టం 10.5 బిలియన్ డాలర్లు(రూ. 79 వేల కోట్లు) తాకొచ్చని పేర్కొంది.
నివేదికలో తేలిన మరిన్ని విషయాలు..
అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కొవిడ్ రెండు, మూడో దశలలో నెలకొన్న పరిస్థితి కంటే.. భారత్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
కొత్త కేసుల్లో 81 శాతానికి పైగా కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవే. ఇది వృద్ధికి ప్రతికూల అంశం.