జాతీయ ఉపాధి విధానానికి(ఎన్ఈపీ) డిసెంబర్ నాటికి తుది రూపు ఇవ్వాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నూతన కార్మిక చట్టాలను అమలు చేస్తూ.. ఈ విధానాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ వంటి చట్టాలకు పార్లమెంట్ గత ఏడాది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఏడాదే వేతన కోడ్ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించింది కార్మిక శాఖ. అయితే మొత్తం నాలుగు చట్టాలను ఒకేసారి అమలు చేయాలనే ఉద్దేశంతో.. వేతన కోడ్ వాయిదా వేసింది. ఈ నాలుగు చట్టాలను 2021 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.