ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరికొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దిల్లీ నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల ముద్రణ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... బడ్జెట్ ప్రతులను లెదర్ సూట్‌కేసులో పెట్టుకొని పార్లమెంటులో అడుగుపెడుతారు.
ఈ సూట్‌కేస్‌కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్‌కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసా...?
ఫ్రెంచ్ నుంచి వాడుకలోకి...
బడ్జెట్‌ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్ అర్థమే లెదర్ బ్యాగ్.
1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్‌స్టోన్ మొదట లెదర్ బ్యాగ్‌లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
బ్రిటిష్ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్ సూట్‌కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్‌కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్‌కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.
ఈ సూట్‌కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.
నలుపు నుంచి..
- భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే శన్ముఖమ్ చెట్టీ 1947లో లెదర్ బ్యాగ్ వినియోగించారు.
- 1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్ బ్యాగ్‌తో పార్లమెంటులో అడుగుపెట్టారు.
- 1958లో జవహర్లాల్ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్‌కేసు వాడారు.