ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు దాదాపు అంతా డిజిటల్ పేమంట్ యాప్స్ వాడటం సర్వ సాధారణమైంది. అయితే పేటీఎం వంటి యాప్‌లు పేమెంట్లు మాత్రమే కాకుండా.. పలు ఇతర సర్వీసులు కూడా అందిస్తున్నాయి. అందులో ఒకటి క్రెడిట్ స్కోరు. పేటీఎం ప్రస్తుతం ఉచితంగానే క్రెడిట్ స్కోరు(credit score check free) సేవలందిస్తోంది. దీనితో పాటు.. ఎన్ని యాక్టివ్ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి, ఎన్ని సార్లు లోన్ ఎంక్వైరీ చేశారు, క్రెడిట్ రేటింగ్‌లో మీ పట్టణం, రాష్ట్రం, జాతీయ స్థాయిలో మీ స్థానం ఎక్కడ అనే వివరాలతో సమగ్ర నివేదికను కూడా పొందొచ్చు.
క్రెడిట్ స్కోర్ఎలా తెలుసుకోవాలి(credit score check online)?
- ముందుగా మీ పేటీఎం అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి
- హోం స్క్రీన్‌లో More ఐకాన్ పై క్లిక్ చేయాలి
- ఈ సెక్షన్లో ఫ్రీ క్రెడిట్ స్కోర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
- ఇక్కడ ఓ ఫారం ఓపెన్ అవుతుంది..
- ఈ ఫారంలో పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ (అవసరమైతేనే) నమోదు చేయాలి
- మీరు మొదటి సారి ఈ ఫీచర్‌ను వాడుతున్నట్లయితే మీ ఫోన్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా క్రెడిట్ స్కోరు సహా సమగ్ర నివేదికను చూడొచ్చు.
ఏమిటీ సిబిల్ స్కోర్?
సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను(credit score cibil) స్పష్టంగా వివరించాలంటే.. దానిని మీ ఫినాన్షియల్ రిపోర్ట్ కార్డ్ అనొచ్చు.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఇది.. 300 నుంచి 900 మధ్య ఉంటుంది.
ఎంత ఉంటే మంచిది?
- 800పైన ఉందంటే.. అద్భుతంగా ఉందని అర్థం
- 700-800 మధ్య ఉంటే బాగుంది అని
- 600-700 మధ్య ఉంటే.. ఫర్వాలేదు కానీ జాగ్రత్త వహించాలి అని అర్థం చేసుకోవచ్చు.
- 600 కన్నా తక్కువగా ఉంటే.. ప్రమాదక స్థాయిలో స్కోరు ఉందని అర్థం. వీరికి లోన్స్ లభించడం కష్టమవుతుంది.