తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంటికి బీమా... ఆర్థిక జీవితానికి ధీమా - undefined

సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తాం. అలాంటి ఇంటికి విపత్తుల వల్ల నష్టం కలిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆర్థిక ఇబ్బందులూ తలెత్తుతాయి. గృహ బీమా తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మరి ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తిస్తుంది?

ఇంటి విషయంలో ధీమాగా ఉండాలంటే కావాలి బీమా

By

Published : Apr 7, 2019, 7:30 AM IST

ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల. ఎంతో కష్టించి సాకారం చేసుకుంటారు. ఇది భారీ పెట్టుబడితో కూడుకున్న అంశం. సాధారణంగా ఇంటి కొనుగోలు, నిర్మాణంపై ఎంతో శ్రద్ధ పెడుతుంటారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దోపిడీలు.... ఇలా పలు కారణాలతో ఇంటికి నష్టం కలిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మరమ్మతులకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే గృహ బీమా తప్పనిసరి.

చాలా మంది గృహ బీమా తీసుకోకపోవటానికి అవగాహన లోపమే ప్రధాన కారణమనేది నిపుణుల అభిప్రాయం. బీమా ఎంత ముఖ్యమో, ఏఏ పరిస్థితుల్లో అది వర్తిస్తుందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం.

భూకంపాలు

కొన్ని దశాబ్దాలుగా భారతదేశం భారీ భూకంపాలను చూసింది. వీటి ప్రభావం లక్షలాది మందిపై పడింది. వందల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2001లో గుజరాత్​లో​ , 2005లో కశ్మీర్​లో భారీ భూకంపాలు వచ్చాయి. లక్షలాది మందికి ఆస్తి నష్టం కలిగింది. ఆ భూకంపాల వల్ల జరిగిన నష్టంలో కేవలం 15 శాతానికే బీమా ఉండటం బాధకరమైన అంశం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల అనంతరం కూడా ఆర్థికంగా పటిష్ఠ స్థితిలో ఉండాలంటే బీమా తీసుకోవటం తప్పనిసరి.

ప్రస్తుతం దాదాపు అన్ని రకాల గృహ బీమాల పరిధిలో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ఇంటితో పాటు లోపలి వస్తువులకు కూడా సాధారణంగా ఈ బీమా వర్తిస్తుంది.

అగ్ని ప్రమాదం

దేశంలో ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందనే వార్తలు తరచూ వింటుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు వీటిని నివారించటం కష్టం. పండిట్​ దీన్​దయాళ్​ అంత్యోదయ భవన్​లో మార్చి నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఫిబ్రవరిలో జరిగిన సెంట్రల్​ దిల్లీ హోటల్​ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. భవనం పూర్తిగా దగ్ధమైపోయింది.

అగ్ని ప్రమాదం వల్ల వచ్చిన నష్టాన్ని సమర్థంగా ఎదుర్కోవటానికి బీమా తీసుకోవటం ఉత్తమం. ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు కూడా బీమాలు తీసుకోవచ్చు. ఇంటితో పాటు లోపలి వస్తువులకు సైతం బీమా అందించే వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

వరదలు, తుపాన్లు, పిడుగులు...

గత పదేళ్లలో వరదలు, తుపానులు, పిడుగులు పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వీటి వల్ల కలిగే ఆస్తి నష్టం కూడా వందల కోట్లకు చేరింది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని సమర్థంగా ఎదుర్కోవటానికి తగిన బీమా ఉండాలి.

సాధారణ గృహ బీమాల పరిధిలోకి ఈ ప్రకృతి వైపరీత్యాలు రావు. వీటికి సంబంధించి యాడాన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాడాన్ల వల్ల బీమా ప్రీమియం పెరిగినప్పటికీ పూర్తి సంరక్షణ దొరుకుతుంది.

దోపిడీ, దొంగతనాలు

భారతదేశంలో దోపిడీ, దొంగతనాలు సంవత్సరానికి 20 నుంచి 27 శాతం పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మెట్రో నగరాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. నగరాల్లో సంవత్సరానికి సుమారుగా 4వేల నుంచి 5వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.

ఇళ్ల దోపిడీకీ బీమా ఉందా? అనేది చాలా మందికి కలిగే సందేహం. దీనికోసం సమగ్ర గృహ బీమాను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ బీమాతో పాటు యాడాన్​ రూపంలో కూడా బీమా పొందవచ్చు. దోపిడీకి సంబంధించే ప్రత్యేకించిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

గృహ బీమా ధరలు

రూ.50 లక్షల గృహ బీమా తీసుకుంటే ఏడాదికి ప్రీమియం రూ. 2,200 నుంచి రూ.2,600 వరకు ఉంటుంది. దీనితో పాటు ఇంట్లోని వస్తువులకు(ఫర్నిఛర్​, గృహోపకరణాలు తదితరాలు) సంబంధించి మరో రూ.5 లక్షల బీమా తీసుకోవాలి. ఈ రెండింటికి కలిపి సంవత్సరానికి ప్రీమియం రూ. 6,500 నుంచి రూ. 7,500 వరకు ఉంటుంది.

(రచయిత - తరుణ్​ మాథుర్​, ఛీఫ్​ బిజనెస్​ ఆఫీసర్​ - సాధారణ బీమా , పాలసీ బజార్​.కామ్​)

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details