ఆర్బీఐ మూలధనం పరిమితులపై నిర్ణయించేందుకు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆర్బీఐ ఆర్థిక మూలధన ముసాయిదా రూపొందించేందుకు ఆరుగురు సభ్యులతో బిమల్ జలాన్ అధ్యక్షతన.. గత ఏడాది డిసెంబర్ 26న ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.
ఆర్బీఐ మూలధనంపై జలాన్ కమిటీ నివేదిక సిద్ధం
ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
బమల్ జలాన్ కమిటీ
ఆర్బీఐ మిగులు నిధులను వచ్చే 3 నుంచి 5 ఏళ్ల వరకు కేంద్రానికి బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కమిటీ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: మార్కెట్లోకి రెడ్మీ కే20 ప్రో- కీ ఫీచర్స్ ఇవే...
Last Updated : Jul 17, 2019, 6:09 PM IST