స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణన విధానాన్ని మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షనేత జైరాం రమేశ్ విమర్శలు చేశారు. జీడీపీని గణించేందుకు ప్రస్తుతం ఉన్న 2011-12 ఆధార సంవత్సరాన్ని.. 2017-18కి మార్చలనేది భయంకరమైన నిర్ణయంగా అభివర్ణించారు.
ఈ అంశంపై నివేదికల ఆధారంగా.. జీడీపీ వృద్ధి విషయంలో మోదీ 2.0 ప్రభుత్వాన్ని ఉత్తమంగా చూపించడమే దీని ముఖ్య ఉద్దేశమా.. అని ప్రశ్నించారు రమేశ్.