కొంత కాలంగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇటీవల ర్యాలీ అవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ నేడు ఇంట్రాడేలో జీవన కాల గరిష్ఠాన్ని దాటింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ల మదుపరులు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడినపడలేదు..!
ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో పడిందన్న సూచనలు లేవని... ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ల మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సూచీలు దూసుకుపోతున్నప్పటికీ... మార్కెట్ మొత్తం సానుకూల ప్రదర్శన చేయట్లేదని, దీనికి సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.