తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా రంగానికి పెట్టుబడి ధీమా..! - బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిధి పెంపు

''ఆరోగ్య బీమా చేయించుకుని ఉంటే బాగుండేది.. వైద్య ఖర్చులు మిగిలేవి'' సాధారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యేముందు మనలో చాలామంది అనుకునేదే.. అయినా వైద్యబీమాపై అంతగా ఆసక్తి చూపించం. అవగాహన లేమితో పాటు.. సంక్లిష్ట నిబంధనలతో దేశంలో ఆరోగ్యబీమా రంగం అంతగా అభివృద్ధి చెందలేదనేది నిజం. ఈ ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వం ఈ బడ్జెట్​లో బీమా రంగంలో పలు సంస్కరణలను అమలు చేసే అవకాశాలున్నాయి.

insurance
బీమా రంగానికి పెట్టుబడి ధీమా..!

By

Published : Jan 31, 2021, 10:15 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆరోగ్య బీమా ప్రాధాన్యాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పింది. ఓ రకంగా వైద్యఖర్చుల భారం నుంచి తప్పించి.. ఆర్థికంగా కుంగిపోకుండా చేసింది. మొత్తంగా చూస్తే భారత్‌లో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి అవగాహన రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో బీమా రంగ విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఎఫ్‌డీఐ పరిధి పెంపు..

ఇప్పటి ప్రభుత్వం బీమారంగంలోకి పెట్టుబడులను రప్పించే అంశంలో స్పష్టతతో ఉంది. 2019 బడ్జెట్‌ ప్రసంగంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ, ఆ తర్వాత బడ్జెట్‌లో మాత్రం ఈ ఊసు లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎఫ్‌డీఐల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ బీమారంగంలో విదేశీ పెట్టుబడి విధానాలను సరళీకరిచనున్నారు. ఈ రంగంలో ఎఫ్‌డీఐలను 74శాతం పెంచనుంది. దేశీయ యాజమాన్యం ఉండాలన్న విధానం కూడా సరళీకరించవచ్చు. ఈ నిర్ణయాలు భారత్‌లో బీమారంగంలోకి సృజనాత్మక విధానాలను తీసుకొచ్చే అవకాశం ఉంది.

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు!

గృహ, పట్టణాభివృద్ధి రంగాలకు పెద్దపీట!

జీవిత బీమా ప్రీమియంపై పన్ను రాయితీ..

గతేడాది ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో పలు శ్లాబుల్లో పన్ను శాతాన్ని తగ్గించింది. కాకపోతే వీటికి సెక్షన్‌ 80సీ వంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఈ సారి ప్రభుత్వం వీటికి కూడా ప్రకటించే అవకాశం ఉంది. జీవిత బీమా ప్రీమియంపై రూ.1.5లక్షల వరకు మినహాయింపును ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో చాలా మంది పన్ను చెల్లింపుదారులు మినహాయింపులు లభిస్తాయనే ఉద్దేశంతో జీవిత బీమా తీసుకొంటున్నారు. దీంతోపాటు సెక్షన్‌ 80డీ కింద వైద్యబీమాకు ఇచ్చే మినహాయింపులు కూడా వర్తింపజేయాలి. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానానికి కూడా ప్రభుత్వం వీటిని అందిస్తే బీమా తీసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించవచ్చు.

బడ్జెట్​ 2021-22: ఎన్నో ఆశలు.. మరెన్నో సవాళ్లు

ఆశల వారధి మోస్తూ.. కరోనా కష్టాలు తీర్చేనా?

బీమా వ్యాపారంపై పన్నుల భారం..

బీమా వ్యాపారంపై ప్రభుత్వం 12.5శాతం పన్ను విధిస్తోంది. వాస్తవానికి ఈ పన్ను రేటు 1976లో 45శాతం నుంచి 65శాతం వరకు కార్పొరేట్‌ పన్ను విధించే రోజుల్లో అమల్లోకి తెచ్చింది. 2019లో కార్పొరేట్‌ పన్నును 22 శాతానికి (సెస్సు, సర్‌ఛార్జి మినహాయించి) తగ్గించింది. ఇక సరికొత్త తయారీ సంస్థలకు 15శాతంగా చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్పొరేట్‌ బీమా సంస్థలకు పన్ను మినహాయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రంగంలో ఎఫ్‌డీఐలను పెంచడానికి ఇది సహకరిస్తుంది.

వ్యాపార నష్టాల సర్దుబాటు ఎలా..

బీమా సంస్థలు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి చాలా కాలం పడుతుంది. పలు కంపెనీలు 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీసం 12ఏళ్లపాటు నష్టాలను క్యారీ ఫార్వర్డు చేసే అవకాశం జీవిత బీమా కంపెనీలకు ఇవ్వాలి. జీవిత బీమాయేతర కంపెనీల విధానాల్లో మార్పులు తీసుకొని రావాలి. 43బీ కింద జీవిత బీమా కంపెనీలకు ఇచ్చే మినహాయింపులను జీవిత బీమాయేతర కంపెనీలకు వర్తింపజేయాలి.

సరళతర చట్టాలు..

సాధారణంగా బీమా కంపెనీలకు ఆర్థిక రక్షణ కోసం కొన్ని కంపెనీలు ఇన్స్యూరెన్స్‌ చేస్తాయి. అలాంటి రీ ఇన్స్యూరర్ల కోసం చట్టాలను సరళతరం చేయాలి. భారత్‌లోని రీ ఇన్స్యూరెన్స్‌ చేసే విదేశీ కంపెనీలపై ప్రభుత్వం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. వీటి విషయంపై నెలకొన్న గందరగోళాన్ని ఈ బడ్జెట్‌లో తొలగించి.. ప్రత్యేకమైన ట్యాక్స్‌కోడ్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:సొంతింటి కలకు.. గడువు పెంచుతారా?

బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

పద్దు 2021: పర్యటక రంగానికి మద్దతు దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details