భారత పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 29.3 శాతం పెరిగింది. పారిశ్రామక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాల ప్రకారం ఈ నెలలో తయారీ రంగం 34.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మైనింగ్ ఉత్పత్తి 23.3 శాతం పెరగ్గా.. విద్యుత్ ఉత్పత్తి 7.5 శాతం అధికంగా జరిగింది.
కరోనా కారణంగా గతేడాది మేలో ఐఐపీ 33.4శాతం పతనం కావడం గమనార్హం. 2020 మార్చి నుంచి ఐఐపీ తీవ్రంగా ప్రభావితమవుతూ వస్తోంది. కరోనా వల్ల 2020 ఏప్రిల్లో 18.7 శాతం, ఏప్రిల్లో 57.3 శాతం పతనమైంది.
ద్రవ్యోల్బణం ఇలా..