భారత పారిశ్రామిక ఉత్పత్తి జూన్ నెలలో 13.6 శాతం పెరిగింది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది.
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాల ప్రకారం.. తయారీ రంగం జూన్ నెలలో 13శాతం వృద్ధి చెందింది. మైనింగ్ ఉత్పత్తి 23.1శాతం పెరగ్గా.. విద్యుత్ ఉత్పత్తి 8.3శాతం అధికంగా జరిగింది. గతేడాది జూన్ నెలలో ఐఐపీ 16.6శాతంగా ఉండడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐఐపీ 45శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఐఐపీ 35.6శాతంగా ఉంది.
2020 మార్చి నుంచి ఐఐపీ తీవ్రంగా ప్రభావితమవుతూ వస్తోంది. కరోనా వల్ల 2020 మార్చిలో 18.7శాతం పతనమైంది. ఏప్రిల్లో 57.3శాతం పతనమైంది.