కరోనా సంక్షోభంలోనూ పరోక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2020-21లో మొత్తం రూ.10.71 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 12.3 శాతం ఎక్కువ. 2019-20లో రూ.9.54 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
బడ్జెట్లో సవరించిన అంచనాలకన్నా కూడా ఈ వసూళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.