తెలంగాణ

telangana

ETV Bharat / business

నిరుద్యోగ భారతం: 45 ఏళ్ల రికార్డ్​ బ్రేక్​ - జీడీపీ వృద్ధిరేటు

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువుదీరిన వేళ వెలువడ్డ ఆర్థిక గణాంకాలు.. అందరినీ విస్మయానికి గురిచేశాయి. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి ఎగబాడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

షాక్​: 45ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం

By

Published : May 31, 2019, 6:26 PM IST

Updated : May 31, 2019, 8:06 PM IST

దేశంలో నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగా నమోదైంది. గత 45 ఏళ్లలో ఇదే అత్యధికమని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

నిరుద్యోగ భారతం...

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.... దేశంలో ఉద్యోగం చేసేందుకు అర్హత కలిగిన పట్టణ యువతలో 7.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ యువత విషయంలో ఆ మొత్తం 5.3 శాతంగా ఉంది.

భారతదేశం మొత్తంగా చూస్తే... నిరుద్యోగ పురుషులు 6.2 శాతం ఉన్నారు. 5.7 శాతం మంది మహిళలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.

లెక్క నిజమైంది...

దేశంలో నిరుద్యోగం లెక్కలపై ఎన్నికల ముందు ఓ నివేదిక లీకైంది. అందులోని గణాంకాలపై రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇప్పుడు కేంద్రం అధికారికంగా విడుదల చేసిన లెక్కలతో... ఆ నివేదిక వాస్తవమేనని తేలింది.

ఇదీ చూడండి: ప్రధానిగా మోదీ తొలి నిర్ణయం ఏంటో తెలుసా?

Last Updated : May 31, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details