దేశీయ సేవా రంగ కార్యకలాపాలు ఏప్రిల్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. కరోనా సంక్షోభం, వృద్ధి రేటుపై ప్రతికూల అంచనాల నేపథ్యంలో సేవా రంగం కుదేలైనట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక పేర్కొంది.
ఏప్రిల్లో సేవా రంగ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 54కి తగ్గిందని తెలిపింది ఐహెచ్ఎస్ మార్కిట్. మార్చిలో ఇది 54.6గా నమోదైనట్లు గుర్తు చేసింది.