తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా ఐదో నెలలోనూ సేవా రంగం డీలా

వరుసగా ఐదో నెలలోనూ సేవా రంగ కార్యకలాపాలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఐహెఎస్​ మార్కిట్ నివేదిక ప్రకారం జులైలో సేవా రంగ పీఎంఐ 34.2గా నమోదైంది.

sector activity still severely
జులైలోనూ సేవా రంగం డీలా

By

Published : Aug 5, 2020, 12:59 PM IST

దేశంలో సేవా రంగ కార్యకలాపాలు జులైలోనూ ఒడుదొడుకుల్లోనే ఉన్నాయి. కరోనా వల్ల డిమాండ్​ తగ్గిపోవడం, సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం వంటివి ఇందుకు కారణమయ్యాయి.

ఐహెచ్​ఎస్ మార్కిట్​ విడుదల చేసిన నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.

ఐహెచ్​ఎస్​ మార్కిట్ ప్రకారం.. జులైలో సేవా రంగ వ్యాపార కార్యకలాపాల పీఎంఐ 34.2 వద్ద ఉంది. జూన్​లో నమోదైన 33.7 తో పోలిస్తే.. ఇది కాస్త ఎక్కువే. అయితే సేవా రంగ పీఎంఐ తక్కువగా నమోదు కావడం వరుసగా ఇది ఐదో నెల.

ఇదీ చూడండి:ఐటీఆర్​ల స్క్రూట్నీ భారీగా తగ్గించిన ఆర్థిక శాఖ

ABOUT THE AUTHOR

...view details