కరోనా రెండో దశ సంక్షోభం తర్వాత దేశీయ తయారీ రంగం తొలిసారి భారీ వృద్ధి రేటును నమోదు చేసింది. డిమాండ్ పెరగటం, స్థానిక ప్రభుత్వాలు కొవిడ్-19 ఆంక్షలు సడలించడం వంటివి ఇందుకు దోహదం చేసినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదికలో పేర్కొంది.
ఈ సానుకూలతలన్నింటితో తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) స్కోరు జులైలో 55.3కు పెరిగింది. జూన్లో ఇది 48.1 గా ఉండటం గమనార్హం.