లాక్డౌన్ కారణంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది తయారీ రంగం. ఏప్రిల్ నెలలో వృద్ధి.. ఎన్నడూ లేనంతగా క్షీణించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంక్షోభంతో కుదేలైన సంస్థలు.. ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయని పేర్కొంది.
ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ఈ నివేదికలో.. ఏప్రిల్లో తయారీ రంగం- పీఎంఐ(పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 27.4కు పడిపోయినట్లు తెలిసింది. మార్చిలో అది 51.8గా ఉండటం విశేషం. గత 15 సంవత్సరాల నుంచి పీఎంఐ డేటా సేకరణ జరుగుతుండగా.. ఈ స్థాయిలో పతనం నమోదు కావడం ఇదే తొలిసారి అని సర్వే పేర్కొంది.