తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగో నెలా తయారీ రంగం డీలా - పీఎంఐ పై కరోనా ప్రభావం

కరోనా ప్రభావంతో తయారీ రంగం ఇంకా అనిశ్చితి ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. జులైలోనూ తయారీ రంగ పీఎంఐ తగ్గినట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది. పీఎంఐ తగ్గటం ఇది వరుసగా నాలుగో నెల కావడం గమనార్హం.

pmi in july
పీఎంఐ

By

Published : Aug 3, 2020, 1:03 PM IST

దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు జులైలోనూ తగ్గాయి. లాక్​డౌన్ ప్రభావం, ఉద్యోగాల కోతతో నెలకొన్న సిబ్బంది కొరత, డిమాండ్ ఇంకా స్తబ్దుగానే ఉండటం వల్ల తయారీ రంగంలో క్షీణత కొనసాగుతున్నట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ సర్వేలో వెల్లడించింది.

ఈ సర్వే ప్రకారం జులైలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జులైలో 46గా నమోదైంది. జూన్​లో ఇది 47.2 గా ఉండటం గమనార్హం.

పీఎంఐ తగ్గటం వరుసగా ఇది నాలుగోసారి. లాక్​డౌన్ కారణంగా తొలుత ఏప్రిల్​లో పీఎంఐ క్షీణత మొదలైంది. దాదాపు 32 నెలల వృద్ధి తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్​కు ముందు పీఎంఐ 50కి పైగా ఉంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి చివరి వారంలో లాక్​డౌన్ విధించింది కేంద్రం. ఈ కారణంగా తయారీ రంగ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్​లాక్ ప్రక్రియ ప్రారంభమైనా.. డిమాండ్ ఇంకా పుంజుకోకపోవడం, ఎగుమతులు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల తయారీ రంగం ఇంకా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ

ABOUT THE AUTHOR

...view details