తెలంగాణ

telangana

By

Published : Dec 1, 2020, 12:22 PM IST

ETV Bharat / business

3నెలల కనిష్ఠానికి తయారీ రంగ పీఎంఐ

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తయారీ రంగం నవంబర్​లో మళ్లీ నెమ్మదించింది. అక్టోబర్​తో పోలిస్తే.. నవంబర్​లో తయారీ రంగ పీఎంఐ తగ్గినట్లు ఐహెచ్ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదిక ద్వారా తెలిసింది.

PMI MANUFACTURING IN NOVEMBER
నవంబర్​ నెల తయారీ రంగ పీఎంఐ

దేశీయ తయారీ రంగ రికవరీ జోరు కాస్త తగ్గింది. నవంబర్​లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఫ్యాక్టరీల ఆర్డర్లు, ఎగుమతులు, కొనుగోళ్ల స్థాయి నెమ్మదించడం వంటివి ఇందుకు కారణంగా ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదికలో తెలిసింది.

ఐహెచ్​ఎస్​ మార్కిట్ నివేదిక ప్రకారం.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ నవంబర్​లో 56.3కు తగ్గింది. అక్టోబర్​లో ఇది 58.9 వద్ద ఉంది. అయినప్పటికీ నవంబర్​లోనూ తయారీ రంగ పీఎంఐ సానుకూల దశలోనే ఉండటం గమనార్హం.

మరిన్ని..

వ్యాపారాల ఆశావాద దృక్పథం నవంబర్​లో తగ్గింది. ప్రభుత్వ విధానాలు, రూపాయి క్షీణత, కొవిడ్ వ్యాప్తి వంటివి వ్యాపారాల విశ్వాసాన్ని ప్రభావితం చేశాయి.

భౌతిక దూరం వంటి మార్గదర్శకాలతో.. కంపెనీల్లో ఉద్యోగకల్పన నవంబర్​లోనూ కాస్త తగ్గింది.

ఇదీ చూడండి:ఎస్‌‌అండ్​పీ చేతికి 'ఐహెచ్‌ఎస్'‌‌-2020లోనే అతిపెద్ద డీల్​

ABOUT THE AUTHOR

...view details