తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక సర్వే 2020-21 హైలైట్స్ - ఆర్థిక సర్వే హైలైట్స్

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది కేంద్ర ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలో ముఖ్య ఆర్థిక సలహాదారు రూపొందించిన ఆర్థిక సర్వే 2020-21ని విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబించే సర్వేలోని వివరాలు ఇలా ఉన్నాయి.

Economic Survey Highlights
ఆర్థిక సర్వే హైలైట్స్​

By

Published : Jan 29, 2021, 6:37 PM IST

Updated : Jan 29, 2021, 7:12 PM IST

బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పార్లమెంట్​ ముందు ఆర్థిక సర్వే 2020-21ని ఉంచింది కేంద్రం. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు రూపొందించిన సర్వేలోని హైలైట్స్ మీకోసం.

  • 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణతను నమోదు చేయొచ్చు
  • కరోనా టీకా ప్రక్రియ వల్ల ఆర్థిక వ్యవస్థ V-ఆకారపు రికవరీని సాధిస్తుంది
  • కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. తగినన్ని విదేశీ మారక‌ నిల్వలు, తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు, దృఢమైన కరెంట్‌ ఖాతా వంటివి V-ఆకారపు‌ రికవరీకి దోహదం చేశాయి
  • 2021-22లో వృద్ధి రేటు ఏకంగా 11 శాతంగా నమోదయ్యే అవకాశముంది
  • ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి వందేళ్లలో ఒకసారి వస్తుంది
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంర్ధంలో.. ఎగుమతులు 5.8 శాతం తగ్గొచ్చు. దిగుమతులు 11.3 శాతం తగ్గొచ్చు.
  • దేశ సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ విషయంలో విదేశీ రేటింగ్‌ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు చేసే విధానం ఉండాలి
  • యూపీ, గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాలు కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయి
  • 2020 ఏప్రిల్​-సెప్టెంబర్​ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరిగాయి
  • సంక్షోభ సమయంలోనూ గత ఏడాది అత్యధికంగా 12 అంకుర సంస్థలు యూనికార్న్​ జాబితాలో చేరాయి

ఆరోగ్య భారతం..

  • వేగంగా స్పందించి లాక్​డౌన్​ విధించడం వల్ల దేశంలో 37 లక్షల కేసులు తగ్గించగలిగాం. లక్ష ప్రాణాలను కాపాడగలిగాం
  • ఆరోగ్య రంగ వ్యయాలు జీడీపీలో 1 శాతం నుంచి 2.5-3 శాతం వరకు పెంచాలని కేంద్రానికి సూచన
  • కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు భారత ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి
  • ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా టెలీమెడిసిన్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది

సంస్కరణలు..

నియంత్రణ నిబంధనలు సరళీకృతం చేయాలి. నిర్ణయ, పర్యవేక్షన విధానాల్లో మరింత పారదర్శకత అవసరం.

సర్వే ఈ బుక్ కోసం క్లిక్​ చేయండి

ఇవీ చూడండి:

Last Updated : Jan 29, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details