ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటును -11.5 శాతానికి తగ్గించింది ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్. తొలుత -4 శాతం ఉంటుందని చెప్పిన మూడీస్.. తొలి త్రైమాసికం ఫలితాల తర్వాత తాజా అంచనాలను విడుదల చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని మూడీస్ అభిప్రాయపడింది. అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం పడిందని వివరించింది. 2021-22 ఆర్థిస సంవత్సరంలో 10.6 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.