భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.6 శాతంగా ఉండొచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతక్రితం అంచనా 5.8 శాతంగా ఉండగా.. సంక్షోభ సమయంలో ప్రభుత్వ స్పందన తదితరాలను పరిగణించి.. తాజా సవరణ చేసినట్లు చెప్పింది. భారత్ వృద్ధి సత్తాను సైతం 7.1 శాతం నుంచి 5.75- 6.25 శాతానికి సవరించింది.
'2020-21లో భారత జీడీపీ క్షీణత 8.6 శాతం' - భారత జీడీపీ అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ క్షీణత 8.6 శాతంగా ఉండొచ్చని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. సంక్షోభ సమయంలో ప్రభుత్వ స్పందన తదితరాలను పరిగణించి.. తాజా సవరణ చేసినట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. వృద్ధి పతనం కాకుండా చేపట్టే చర్యల విషయంలో ప్రభుత్వం నుంచి బలహీన స్పందన కనిపించిందని ఆ సంస్థ అంటోంది.
వృద్ధి పతనం కాకుండా చేపట్టే చర్యల విషయంలో ప్రభుత్వం నుంచి బలహీన స్పందన కనిపించిందని ఆ సంస్థ అంటోంది. సెప్టెంబరు త్రైమాసికం తర్వాత గిరాకీ, ఆర్థిక రికవరీ కనిపించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కనిపిస్తున్న రికవరీ కొనసాగకపోవచ్చని పెరుగుతున్న కరోనా కేసులే అందుకు కారణమని యూబీఎస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. అయితే 2021-22లో మాత్రం భారత వృద్ధి 10 శాతం మేర నమోదవుతుందని ఆమె అంచనా వేశారు. త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. సంస్కరణలు కూడా వాటికి జతకలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. మౌలికాభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు, ఉద్యోగ సృష్టిని కల్పించే మరిన్ని పనులను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని జైన్ అన్నారు.
ఇదీ చూడండి:-'వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం'