తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21లో భారత వృద్ధిరేటు -8%: ఫిక్కీ - వ్యవసాయ రంగ వృద్ధి రేటు అంచనాలు

దేశ ఆర్థిక వృద్ధి రేటు 2020-21లో -8 శాతంగా నమోదవ్వచ్చని ఫిక్కీ తాాజా సర్వేలో అంచనా వేసింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులు ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని విభాగాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేయొచ్చని పేర్కొంది.

FICCI on Indian GDP
జీడీపీపై ఫిక్కీ అంచనాలు

By

Published : Jan 26, 2021, 5:27 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు క్షీణత 8 శాతంగా నమోదవ్వొచ్చని పరిశ్రమల విభాగం 'ఫిక్కీ' మంగవారం ప్రకటించింది. ఇదే నెలలో చేసిన ఎకానమిక్ ఔట్​లుక్ సర్వే ద్వారా ఈ అంచనాలు వెల్లడించింది. ప్రముఖ ఆర్థికవేత్తలు బ్యాంకింగ్, ఆర్థిక విభాగాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని వివరించింది ఫిక్కీ. 2020-21లో సానుకూల వృద్ధి రేటును నమోదు చేసే రంగం ఇదొక్కటేనని పేర్కొంది. లాక్​డౌన్ సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలు సాగటం, రుతుపవనాల సానుకూలతలు ఇందుకు కారణమని తెలిపింది.

పారిశ్రామిక, సేవా రంగాలు మాత్రం 2020-21లో వరుసగా 10 శాతం, 9.2 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని అంచనా వేసింది ఫిక్కీ. కరోనా వల్ల ఈ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు వివరించింది.

త్రైమాసికాల పరంగా చూస్తే.. 2020-21లో క్యూ 4లో 0.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని తెలిపింది ఫిక్కీ. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 9.6 శాతంగా నమోదవుతుందని ఫిక్కీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:2021లో భారత వృద్ధి రేటు 7.3%: ఐరాస

ABOUT THE AUTHOR

...view details