ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ (GDP in FY22 Q1) జీడీపీ వృద్ధి రేటు 18.5 శాతంగా నమోదవ్వచ్చని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక అంచనా వేసింది. 'న్యూ కాస్టింగ్ మోడల్' ఆధారంగా ఈమేరకు లెక్కగట్టింది. దేశీయ పారిశ్రామిక, సేవా రంగ కార్యకలపాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాలు సహా మొత్తం 41 రకాల ఇండికేటర్స్‌ను కలిపి 'న్యూకాస్టింగ్ మోడల్ (Nowcasting Model)'ను అభివృద్ధి చేసింది ఎస్బీఐ.
అయితే వృద్ధి రేటుపై ఆర్బీఐ (RBI on growth rate) అంచనాల కన్నా.. ఎస్బీఐ ఎకోరాప్ అంచనాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశ వృద్ధి రేటు 21.4 శాతంగా నమోదవ్వచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఈ స్థాయిలో సానుకూల అంచనాలను విడుదల చేసేందుకు.. గత ఏడాది ప్రతికూలంగా నమోదైన వృద్ధి రేటే కారణమని స్పష్టం చేసింది.
జీవీఏ 15 శాతం..
2021-22లో వస్తు సేవల నికర విలువ (జీవీఏ) 15 శాతం వద్ద ఉండొచ్చని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో 4,069 కార్పొరేట్ల జీవీఏ 28.4 శాతంగా నమోదైనట్లు వివరించింది.