కరోనా ప్రభావంతో 2020 జనవరి- మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతానికి పడిపోయింది. ఫలితంగా 2019- 20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4.2 శాతానికి పరిమితమైందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. 11 ఏళ్లలో ఇదే కనిష్ఠం.
ఎన్ఎస్ఓ నివేదిక ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో జీడీపీ పెరుగుదల 5.7 శాతంగా నమోదైంది. ఆ ఏడాది మొత్తం 6.1 శాతం వృద్ది రేటు నమోదు చేసింది.