తెలంగాణ

telangana

'2019-20లో భారత వృద్ధి 7 శాతమే'

By

Published : Jul 18, 2019, 10:25 PM IST

2019-20లో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది ఏషియన్ డెవలప్​మెంట్​ బ్యాంకు. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మాత్రం భారత్​.. చైనా కన్నా మందుంటుందని పేర్కొంది.

'2019-20లో భారత వృద్ధి 7.0 శాతమే'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంకు (ఏడీబీ). గత ఆర్థిక సంవత్సరం మందగించిన వృద్ధి సహా అభివృద్ధి చెందిన దేశాలు విధిస్తున్న వర్తక వ్యతిరేక ఆంక్షలే వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని పేర్కొంది.

అయినప్పటికీ.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో చైనా కన్నా భారత్ ముందుంటుందని ఏడీబీ పేర్కొంది.

ఏడీబీ విడుదల చేసిన 'ఏషియన్ డెవలప్​మెంట్​ ముఖచిత్రం 2019'లో పలు కీలక విషయాలు వెల్లడించింది.

2019లో చైనా వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020లో మరింత క్షిణించి 6.1 శాతంగా నమోదవుతుందని తెలిపింది. ఇందుకు అమెరికాతో వాణిజ్య యుద్ధమే కారణమని పేర్కొంది.

భారత్ మాత్రం 2020-21లో 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది ఏడీబీ. వ్యాపారాలు మెరుగవ్వడం, బ్యాంకులు బలపడటం, వ్యవసాయ సమస్యలు తగ్గటం వంటివి వృద్ధికి తోడ్పాటునందిస్తాయని పేర్కొంది.

ఇదీ చూడండి: రుచించని త్రైమాసిక ఫలితాలు.. కుదేలైన సూచీలు

ABOUT THE AUTHOR

...view details