తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2020, 10:39 PM IST

ETV Bharat / business

అంతర్జాతీయ రేటింగ్​లపై సీఈఏ అసంతృప్తి

అంతర్జాతీయ సంస్థలు భారత్​కు అతి తక్కువ రేటింగ్​ ఇవ్వటాన్ని జాతీయ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్​ ఆక్షేపించారు. ప్రస్తుత పరిస్థితులు మరింత మంచి రేటింగ్​ను డిమాండ్ చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

BIZ-CEA-RATING AGENCIES
సీఈఏ

భారత్​కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్​ అండ్​ పీ, మూడీస్​ ఇచ్చిన గ్రేడింగ్​పై ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్​లోని పరిస్థితులు మరింత మంచి రేటింగ్​ను ఆశిస్తున్నాయని అన్నారు.

అయితే భారత్​ ఆర్థిక సంస్కరణలపై రేటింగ్ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేయటంపై సానుకూలంగా స్పందించారు కృష్ణమూర్తి. వచ్చే ఏడాది అధిక వృద్ధి రేటు సాధించేందుకు ఇవి కీలకం కానున్నాయని రేటింగ్ సంస్థలు గుర్తించాయనన్నారు.

"రికవరీ సాధ్యమైతేనే ఈ ఏడాది ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ రెండో అర్ధవార్షికం లేదా వచ్చే ఏడాది గాడిన పడుతుందో లేదో చెప్పలేం. ఈ ఏడాదికి గానూ వృద్ధి అంచనాలపై ఆర్థిక శాఖ భారీ ఎత్తున కృషి చేస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనాకు వస్తాం."

- కృష్ణమూర్తి సుబ్రమణియన్​

ప్రైవేటీకరణపై మాట్లాడిన కృష్ణమూర్తి.. వ్యూహాత్మక రంగంలో బ్యాంకింగ్​ భాగమవుతుందని తెలిపారు. వ్యూహాత్మక, వ్యూహరహిత రంగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని స్ఫష్టం చేశారు.

అంతర్జాతీయ సంస్థల రేటింగ్..

భారత సౌర్వభౌమ రేటింగ్‌ను ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ 'ఎస్‌ అండ్‌ పీ' ప్రకటించింది. వరుసగా 13వ ఏడాదీ అతితక్కువ పెట్టుబడి గ్రేడ్‌లోనే భారత్‌ను ఉంచింది. అయితే మూడీస్‌ ఇటీవల రేటింగ్‌ తగ్గించినప్పటికీ, కరోనా సంక్షోభంలో నూ 'ఎస్‌ అండ్‌ పీ' రేటింగ్‌ను మార్చలేదు.

వృద్ధి భయాలు పెరుగుతున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యలోటు పరిస్థితి స్థిరపడుతున్నాయని, 2021 నుంచి రికవరీ మొదలుకావొచ్చని అభిప్రాయపడింది. భారత దీర్ఘకాలిక వృద్ధి రేటుపై భయాలు పెరుగుతున్నాయని, ప్రస్తుతం చేపట్టిన సంస్కరణలను మెరుగ్గా అమలు చేయగలిగితే భారత వృద్ధి రేటు పోటీ దేశాల కంటే ముందంజలో ఉండే అవకాశం ఉందని 'ఎస్‌ అండ్‌ పీ' వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details