తెలంగాణ

telangana

ETV Bharat / business

సరికొత్త రికార్డు స్థాయికి విదేశీ మారకపు నిల్వలు - విదేశీ మారకపు నిల్వల వివరాలు

దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 3తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు 461.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

FOREX
సరికొత్త రికార్డు స్థాయికి విదేశీ మారకపు నిల్వలు

By

Published : Jan 11, 2020, 10:01 AM IST

దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఈ నెల 3తో ముగిసిన వారానికి 3.69 బిలియన్‌ డాలర్లు పెరిగి, జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 461.16 బిలియన్​ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

సమీక్షా వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు 3.01 బిలియన్​ డాలర్లు పెరిగి, 427.95 బిలియన్​ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 666 మిలియన్‌ డాలర్లు పెరిగి 28.06 బిలియన్​ డాలర్లకు చేరాయి.

ఐఎంఎఫ్‌ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 7 మిలియన్​ డాలర్లు పెరిగి 1.45 బిలియన్​ డాలర్లకు, దేశ నిల్వల స్థితి 3 మిలియన్​ డాలర్లు పెరిగి 3.70 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఐఎంఎఫ్‌ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 7 మి.డాలర్లు పెరిగి 1.45 బిలియన్​ డాలర్లకు, దేశ నిల్వల స్థితి 3 మిలియన్​ డాలర్లు పెరిగి 3.70 బిలియన్​ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఈ నెల 19 నుంచి అమెజాన్ గ్రేట్​ ఇండియా సేల్

ABOUT THE AUTHOR

...view details