భారత ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది ఏకంగా 12 శాతంగా నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. రానున్న రోజుల్లో పరిస్థితులు భారత్కు మరింత మారనుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. అయితే 2020 వృద్ధి రేటు మాత్రం -7.1 శాతంగా ఉంటుందని వెల్లడించింది.
కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఆశించినదానికన్నా వేగంగా కోలుకుంటున్నట్లు మూడీస్ వివరించింది. 2020 ఆక్టోబర్-డిసెంబర్లో వృద్ధి రేటు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా -7.5 శాతం నుంచి 0.4 శాతానికి పెరగటం ఇందుకు ఉదాహరణగా పేర్కొంది.