తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా మూడో నెలలోనూ సేవా రంగం డీలా - జులైలో సేవా రంగ పీఎంఐ

వరుసగా మూడో నెలలోనూ సేవా రంగ కార్యకలాపాలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక ప్రకారం.. సేవా రంగ పీఎంఐ స్కోరు జులైలో 45.4గా ఉన్నట్లు తేలింది.

service sector PMI in July
సేవా రంగ పీఎంఐ

By

Published : Aug 4, 2021, 12:37 PM IST

దేశీయ సేవా రంగ కార్యకలాపాలు వరుసగా మూడో నెలలోనూ (జులైలో) ప్రతికూలంగానే ఉన్నట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక పేర్కొంది. గత నెలలో సేవా రంగ వ్యాపార కార్యకలాపాలు, కొత్త ఆర్డర్లు, ఉద్యోగ నియామకాలు సాధారణం కన్నా తక్కువగా నమోదైనట్లు తెలిపింది. కరోనా భయాలు, స్థానిక ఆంక్షలు సేవా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లు పేర్కొంది.

అయినప్పటికీ.. జులైలో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్​ (పీఎంఐ) స్కోరు జూన్​తో పోలిస్తే.. 41.2 నుంచి 45.4 వద్దకు పెరగటం గమనార్హం.

సాధారణంగా పీఎంఐ స్కోరు 50కి పైన నమోదైతే.. వృద్ధి బాటలో ఉన్నట్లు.. అంతకన్నా తక్కుగా నమోదైతే క్షీణతను సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

నివేదికలోని మరిన్ని వివరాలు..

  • సేవా రంగంలో ఉద్యోగ నియామకాలు క్షీణించడం వరుసగా ఇది ఎనిమిదవ నెల
  • రానున్న నెలల్లో కూడా ఉద్యోగ నియామకాలు (సేవా రంగంలో) ప్రతికూలంగానే ఉండొచ్చు
  • ద్రవ్యోల్బణ కారణాలు కూడా సేవా రంగంపై ఒత్తిడి పెంచాయి
  • సేవా రంగంలోని కంపెనీలు కూడా భవిష్యత్​పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

ఇదీ చదవండి:మూడు నెలల గరిష్ఠానికి తయారీ రంగ పీఎంఐ!

ABOUT THE AUTHOR

...view details