కరోనా సంక్షోభంతో గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి పట్టాలెక్కుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది. 2021-22లో 9.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని లెక్కగట్టింది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసింది ఫిచ్.
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వృద్ధిని బలహీనపరించిందని.. పెరిగిన ప్రజా రుణభారం కారణంగా అనేక సవాళ్లను తీసుకువచ్చిందని ఫిచ్ అభిప్రాయపడింది.