తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఎన్నడూ చూడని మాంద్యం- జీడీపీ 5% క్షీణత'

భారత్​ గతంలో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని 'గోల్డ్​మాన్ శాక్స్' అంచనా వేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 5 శాతం క్షీణించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుత రెండో త్రైమాసికం నాటికి దేశ జీడీపీ.. 45 శాతానికి పడిపోనుందని విశ్లేషించింది.

BIZ-VIRUS-ECONOMY-GOLDMAN
జీడీపీ 5% క్షీణత

By

Published : May 19, 2020, 6:52 AM IST

వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరం నాటికి వాస్తవ జీడీపీ 5 శాతం క్షీణించే అవకాశం ఉందని 'గోల్డ్‌మన్‌ శాక్స్‌‌' గ్రూపు అంచనా వేసింది. ఇలాంటి మాంద్యాన్ని భారత్‌ గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని తమ నివేదికలో పేర్కొంది.

త్రైమాసికాల వారీగా..

గడచిన మూడు నెలలను పరిశీలిస్తే ప్రస్తుత రెండో త్రైమాసికం నాటికి.. దేశ జీడీపీ 45 శాతానికి తగ్గే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇంతకుముందు ఇచ్చిన నివేదికలో మాత్రం కేవలం 20 శాతం తగ్గుదల ఉంటుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌‌ అంచనా వేసింది.

అయితే ఇది మూడో త్రైమాసికం నాటికి 20 శాతం పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో 14 శాతం, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో 6.5 శాతం వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ప్యాకేజీతో కష్టమే..

ఈ సమయంలో ఉద్దీపన చర్యల్లో భాగంగా ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వివిధ రంగాల్లో ఎన్నో సంస్కరణలకు తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అయితే, ఇవన్నీ ఆర్థిక ప్రగతిపై సత్వర ప్రభావం చూపించవని గోల్డ్‌మన్ శాక్స్‌‌కు చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్‌ కారణంగా గతరెండు నెలలుగా దేశంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ సమయంలో భారత్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని 'గోల్డ్‌మన్‌ శాక్స్‌'‌ గ్రూప్‌ అంచనా వేసింది.

ABOUT THE AUTHOR

...view details