కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలోకి జారుకున్న దేశ ఆర్థిక వ్యవస్ధ.. అంచనాలకన్నా చాలా వేగంగా కోలుకుంటోందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు దేశ ఆర్థిక వ్యవస్ధ పేరుతో ఆర్బీఐ డిసెంబర్ బులెటిన్‌లో కథనం రాసిన విశ్లేషకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో వేగం పెరిగిందన్న విషయాన్ని గుర్తు చేసిన నిపుణులు.. ప్రస్తుతం అది స్ధిరంగా కొనసాగుతోందని వివరించారు.
దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా లేకపోవడం, సూక్ష్మ ఆర్థిక విధానాలకు మద్దతు వాతావరణం అనుకూలంగా ఉండటం.. ఆర్థిక కార్యకలాపాలు స్ధిరంగా కొనసాగడానికి ఉపయోగపడ్డాయని అభిప్రాయపడ్డారు నిపుణులు.