ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 16.5 శాతం మేర క్షీణించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన పరిశోధన నివేదిక ఎకోరాప్‌లో అంచనా వేసింది. ఏప్రిల్-జూన్‌లో 20 శాతం మేర వృద్ధి తగ్గవచ్చని మే నెలలో అంచనా వేయగా.. తాజాగా కొంత తగ్గించింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లోనూ సానుకూల అంశాల నేపథ్యంలో దీన్ని సవరించినట్లు సోమవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.
క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 16.5 శాతం క్షీణత! - భారత జీడీపీపై ఎస్‌బీఐ తాజా అంచనాలు
దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ఇంకా తొలగిపోలేదని బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ఎకోరాప్ నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2020-21 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 16.5 శాతం మేర తగ్గొచ్చని ఇందులో అంచనా వేసింది. మేలో వేసిన అంచనాలతో పోలిస్తే.. ఇది కాస్త తక్కువగా ఉండటం గమనార్హం.
వృద్ధి రేటుపై ఎస్‌బీఐ నివేదిక
ఎస్‌బీఐ నివేదిక ముఖ్యాంశాలు..
- ఇప్పటిదాకా 1,000 వరకు నమోదిత కంపెనీలు ఫలితాలను ప్రకటించగా.. 25% కంపెనీలు తమ ఆదాయాల్లో; 55%సంస్థలు లాభాల్లోనూ క్షీణతను నమోదు చేశాయి. అయినప్పటికీ కార్పొరేట్ జీవీఏ (స్థూల విలువ జోడింపు) కేవలం 14.1% తగ్గనుంది. వ్యయాల్లో మార్పుచేర్పులతో నమోదిత కంపెనీల ఆదాయాలు తగ్గాయి కానీ.. మార్జిన్లపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్ఛు
- జులై-ఆగస్టులో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపించింది. గ్రామీణ జిల్లాల్లో మొత్తం కొత్త కేసులు ఆగస్టులో ఏకంగా 54% పెరిగాయి. 10 కంటే తక్కువ కేసులున్న గ్రామాల సంఖ్యా తగ్గింది. ఈ జిల్లాలన్నీ ఆయా రాష్ట్రాలకు 2-4% జీఎస్‌డీపీ వాటాను అందిస్తున్నాయి. కరోనా కారణంగా మొత్తం జీఎస్‌డీపీలో 16.8%వరకు క్షీణత కనిపించవచ్ఛు
- రాష్ట్రాల వారీగా విశ్లేషణ చూస్తే.. మొత్తం జీడీపీ నష్టంలో 73.8% వాటా కేవలం 10 రాష్ట్రాలదే. ఇందులో మహారాష్ట్ర అత్యధికంగా 14.2% నష్టానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా..తమిళనాడు(9.2%), ఉత్తర్ప్రదేశ్(8.2%)లు ఎక్కువ నష్టాలే కలిగిస్తున్నాయి.
- 2020-21లో దేశ వ్యాప్తంగా తలసరి నష్టం రూ.27,000 నమోదు కావొచ్చు. తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, దిల్లీ, హరియాణా, గోవాలలో ఈ నష్టం రూ.40,000 కంటే అధికంగా ఉండొచ్ఛు
ఇదీ చూడండి:టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వింత కోరిక