తెలంగాణ

telangana

ETV Bharat / business

'అంచనాలకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ' - భారత ఆర్థిక వ్యవస్థపై ఆక్స్​ఫర్డ్ అంచనాలు

కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతున్నట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ.. వచ్చే ఏడాది నుంచి తగ్గుముఖం పట్టొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Rapid Indian Economy Recovery
వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ

By

Published : Nov 15, 2020, 1:34 PM IST

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు గ్లోబల్ ఫోర్​కాస్టింగ్ సంస్థ ఆక్స్​ఫర్ట్ ఎకానమిక్స్ వెల్లడించింది. దీనితోపాటు రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఉండకపోవచ్చని అంచనా వేసింది.

ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 6 శాతానికిపైగా నమోదవ్వచ్చని అంచనా వేసింది ఆక్స్​ఫర్ట్ నివేదిక. ఈ నేపథ్యంలో డిసెంబర్​లో జరగనున్న ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమీక్షలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచేందుకే సభ్యులు మొగ్గు చూపొచ్చని వివరించింది.

ద్రవ్యోల్బణం పెరుగుదల ఎందుకు?

కూరగాయలు, గుడ్ల ధరల్లో పెరుగుదల అక్టోబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దాదాపు ఆరున్నర సంవత్సరాల గరిష్ఠం వద్ద 7.61 శాతానికి పెంచినట్లు ఆక్స్​ఫర్డ్ ఎకానమిక్స్ పేర్కొంది. ఇది ఆర్​బీఐ, కేంద్రం పెట్టుకున్న లక్ష్యంకన్నా చాలా ఎక్కువ. 2021లో మాత్రం ద్రవ్యోల్బణం తగ్గుముఖం సాధారణ స్థితికి చేరొచ్చని బలంగా నమ్ముతున్నట్లు నివేదిక వెల్లడించింది.

అయితే ప్రస్తుతం కింది స్థాయి ఆర్థిక కార్యకలాపాల డేటాను పరిశీలిస్తే.. ఆర్థిక వ్యవస్థ అంచనాలకన్నా వేగంగానే పుంజుకుంటున్నట్ల తెలుస్తోందని ఆక్స్​ఫర్డ్ ఎకామనిక్స్ పేర్కొంది.

ఇదే కారణాలతో..'మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్'​ కూడా దేశ జీడీపీ అంచనాలను సవరించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 9.6 శాతం క్షీణించొచ్చని తొలుత విడుదల చేసిన అంచనాలను.. తాజాగా 8.9 శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి:తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు

ABOUT THE AUTHOR

...view details