తెలంగాణ

telangana

ETV Bharat / business

పర్యటక కేంద్రాలకు 'తేజస్​' రైళ్లు.. కొత్తగా 100 విమానాశ్రయాలు! - బడ్జెట్ 2020 ప్రభావం

రవాణా అంశమై రానున్న ఏడాది చేపట్టబోయే పనులను బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పర్యటక ప్రదేశాలను కలిపేందుకు సెమీ హైస్పీడ్ తేజస్ రైళ్లను మరిన్ని ప్రవేశపెడతామన్నారు. ఉడాన్ పథకానికి మద్దతిచ్చేందుకు కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి పరుస్తామన్నారు.

transport
బడ్జెట్​లో రవాణా

By

Published : Feb 1, 2020, 1:01 PM IST

Updated : Feb 28, 2020, 6:38 PM IST

పర్యటక కేంద్రాలకు 'తేజస్​' రైళ్లు.. కొత్తగా 100 విమానాశ్రయాలు!

రవాణా వ్యవస్థ నిర్మాణానికి 2020-21 బడ్జెట్​లో రూ. 1.7 లక్షల కోట్లను కేటాయించామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పర్యటక ప్రదేశాలను కలిపేందుకు సెమీ హైస్పీడ్ తేజస్ రైళ్లను మరిన్ని తీసుకువస్తామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. రైల్వే ట్రాకుల పక్కన భారీ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

1150 నూతన రైళ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తీసుకువస్తామని, 4 స్టేషన్లను ప్రైవేటు సహకారంతో నవీకరిస్తామన్నారు. కనీసం ఒక్క పెద్ద నౌకాశ్రయాన్ని అయినా కార్పొరేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నామన్నారు. ఉడాన్ పథకానికి మద్దతిచ్చేందుకు 2024 నాటికి కొత్తగా మరో 100 ఎయిర్​పోర్ట్​లను అభివృద్ధి చేస్తామన్నారు.

"రైల్వే ట్రాకుల పక్కన రైల్వే భూముల్లో భారీ సామర్థ్యం కలిగిన సౌర వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పర్యటక ప్రాంతాలకు తేజస్ తరహా రైళ్లను ఏర్పాటు చేస్తాం. నౌకాశ్రయాల సామర్థ్యం పెరగాల్సి ఉంది. సాంకేతికత వినియోగించాలి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఏర్పరచాలని ప్రభుత్వం లక్ష్యించింది. కనీసం ఒక నౌకాశ్రయాన్ని అయినా కార్పొరేట్​ సంస్థలకు అప్పగించి స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేస్తాం. గత ఐదేళ్లలో నదీ రవాణా వ్యవస్థ పెరిగింది. అంతర్జాతీయ రవాణాతో పోల్చితే భారత్​లో విమాన రవాణా పెరిగింది. ఉడాన్ పథకం కింద మరో 100 విమానాశ్రాయాలను 2024 వరకు అభివృద్ధి పరుస్తాం. ప్రస్తుతమున్న 600 విమాన సర్వీసులను ఈ ఏడాది 1200కు పెంచాలని నిర్దేశించుకున్నాం. రూ.1.7 లక్షల కోట్లను రానున్న ఆర్థిక సంవత్సరంలో రవాణా నిర్మాణ రంగానికి కేటాయిస్తున్నాం."

-నిర్మల సీతారామన్, ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: పద్దు 2020: మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు

Last Updated : Feb 28, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details