కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21 ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధి 9.6 క్షీణించే అవకాశం ఉందని అంచనా వేసింది ప్రపంచ బ్యాంకు. ఇది ప్రైవేటు పెట్టుబడులు, గృహ వ్యయాలలో తగ్గుదలని సూచిస్తోందని పేర్కొంది. అయితే.. 2021లో భారత్ పుంజుకొని.. 5.4 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది.
గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ విడుదల చేసింది ప్రపంచ బ్యాంకు. భారత్లో ఐదో వంతు ఉద్యోగాలు కల్పించే అసంఘటిత రంగంలో కొవిడ్-19 కారణంగా తీవ్రం సంక్షోభం ఏర్పడినట్లు తెలిపింది.
"భారత్లో కరోనా మహమ్మారి సంక్షోభంతో ఆర్థిక వృద్ధి మందగించింది. దాని ప్రతిఫలంగా 2020-21 ఏడాదిలో వృద్ధి 9.6 శాతం క్షీణించవచ్చు. అలాగే 2021లో పుంజుకుని 5.4 శాతం వృద్ధి నమోదవుతుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగటం అందుకు దోహదపడుతుంది. అలాగే.. తయారీ, సేవా రంగంలో రికవరీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనేదానిని సూచిస్తోంది. ఆర్థిక రంగంలో నిరర్ధక రుణాలు భారీగా పెరిగిపోయాయి. "