తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణత - China's economy

Indian economy contracts by 7.5 pc in July-September 2020: Govt data
క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణత

By

Published : Nov 27, 2020, 5:50 PM IST

Updated : Nov 27, 2020, 7:29 PM IST

17:47 November 27

క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణత

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబరు)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 7.5 శాతం క్షీణించింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) ప్రకటించింది. క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని తెలిపింది. 

2019-20 ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతం ఉందని గుర్తుచేసింది ఎన్​ఎస్ఓ.  

జూన్​ నుంచే భారత ఆర్థిక వ్యవస్థ పూర్వవైభవం దిశగా పయనించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లాక్​డౌన్​ అనంతరం పరిస్థితులతో.. నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు ఎన్​ఎస్​ఓ అంచనా వేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో ఈ రంగంలో 3.4 శాతం వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. వాణిజ్య, సేవల రంగంలోనూ ఊహించిన 15.6 శాతం క్షీణత కంటే తక్కువే క్షీణించిందని వెల్లడించింది.   

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ కూడా.. భారత ఆర్థిక వ్యవస్థ ఊహించినదాని కంటే వేగంగా పరుగులు పెడుతోందని గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. లాక్​డౌన్​ తర్వాత ఆర్థిక రంగం కోలుకుంటోందని స్పష్టం చేశారు.

అంచనాలను మించి..

ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి ఫలితాలు రావడం సానుకూల పరిణామమని అన్నారు ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్​. 'కరోనా మహమ్మారి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కనుక.. ఇంకా జాగ్రత్తగా ఉండాలి' అని అన్నారు. 

క్యూ1లో 23.9 శాతం క్షీణత.. 

కొవిడ్​ సంక్షోభం, లాక్​డౌన్​లతో 2020-21 తొలి త్రైమాసికం(ఏప్రిల్​-జూన్​)లో జీడీపీ 23.9 శాతం క్షీణించింది.

కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 25న కఠినమైన లాక్​డౌన్​ను విధించింది భారత ప్రభుత్వం. అనంతరం.. సడలింపులు ఇస్తూ వచ్చింది. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోసారి పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. 

చైనాలో ఘనం..

భారత్​తో పోలిస్తే చైనా ఆర్థికవ్యవస్థ మాత్రం కొంతకాలంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఆ దేశ వృద్ధిరేటు 4.9 శాతంగా నమోదైంది. తొలి త్రైమాసికం కంటే ఇది 3.2 శాతం అధికం.  

Last Updated : Nov 27, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details