పెట్రోల్, డీజిల్ మాదిరిగానే గ్యాస్ ధరలనూ మార్కెట్ శక్తులకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమైంది. దశలవారీగా గ్యాస్ ధరలపై నిర్ణయాధికారాన్ని వదిలేస్తామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం చెప్పారు. వాటి ధరలను మార్కెట్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
దేశంలో చమురు డిమాండ్ 2019 జూన్‌తో పోలిస్తే 85 శాతంగా ఉందని ప్రధాన్ చెప్పారు. 2021 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికానికి డిమాండ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్‌లో జెట్ ఇంధనం మినహా చమురు గిరాకీ కరోనా మునుపటి స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు.