ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ద్రవ్యలోటు అంచనాలకు మించి భారీగా పెరుగతుందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. ఆశించిన స్థాయికన్నా ఆదాయం తక్కువగా నమోదవ్వటం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నట్లు కూడా వెల్లడించింది.
2021-22 ద్రవ్యలోటు అదుపు తప్పొచ్చు: ఫిచ్ - భారత ద్రవ్యలోటుపై ఫిచ్ నివేదిక
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగాయి. దీనితో పాటు వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న ఆంక్షల వల్ల ఆదాయం తగ్గింది. ఈ కారణంగా 2021-22లో దేశ ద్రవ్యలోటు అంచనాలకు మించి భారీగా పెరగొచ్చని ఫిచ్ వెల్లడించింది.
అంచనాలు దాటనున్న భారత ద్రవ్యలోటు
2021-22లో ద్రవ్యలోటు 6.8 శాతంగా నమోదవుతుందని బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది. అయితే ఇది 8.3 శాతానికి పెరగొచ్చని ఫిచ్ భావిస్తోంది. ఇంతకు ముందు అంచనాల్లోనూ ద్రవ్యలోటు 8శాతంగా నమోదవుతుందని ఫిచ్ పేర్కొనడం గమనార్హం.