కరోనా ఇబ్బంది పెట్టినా 2020-21 ఏడాదిలో భారత్ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్ ఖాతా మిగులును నమోదు చేయడం విశేషం. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం కరెంట్ ఖాతా, లోటు నమోదైంది.
కరోనాలోనూ కరెంట్ ఖాతా మిగులు - India current account surplus
కరోనా సంక్షోభంలోనూ 2020-21లో భారత్ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసినట్లు బుధవారం ఆర్బీఐ గణాంకాలను విడుదల చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 43 బిలియన్ డాలర్ల నుంచి 44 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపింది.
మార్చి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 8.1 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 1 శాతానికి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 0.6 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతంగా మాత్రమే ఉంది. ఇక డిసెంబరు త్రైమాసికం (2020-21)లోనూ లోటు 0.3 శాతంగా నమోదైనట్లు బుధవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో వాణిజ్య లోటు 157.5 బిలియన్ డాలర్ల నుంచి 102.2 బిలియన్ డాలర్లకు తగ్గడంతో కరెంట్ ఖాతా నిల్వలు కాస్తా మిగులులోకి వెళ్లాయని ఆర్బీఐ పేర్కొంది.
- కరోనా ఉన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 43 బిలియన్ డాలర్ల నుంచి 44 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపింది.
- నికర విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు కూడా 1.4 బి. డాలర్ల నుంచి ఏకంగా 36.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
- 2020-21లో విదేశీ మారక నిల్వలు 99.2 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. గతేడాది 64.9 బిలియన్ డాలర్లే వృద్ధి చెందాయి. ఇతర 'ఫ్రధాన కరెన్సీ'లతో పోలిస్తే అమెరికా డాలరు క్షీణించడం ఇందుకు కారణం.
- మార్చి 2021 నాటికి భారత విదేశీ రుణాలు 11.5 బిలియన్ డాలర్లు పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ రుణాలు, జీడీపీ మధ్య నిష్పత్తి అంతక్రితం ఏడాది మార్చి చివరతో పోలిస్తే 20.6 శాతం నుంచి 21.1 శాతానికి పెరిగింది.
- విదేశీ వాణిజ్య రుణాలు అంతక్రితం ఏడాది 21.7 బిలియన్ డాలర్లు ఉండగా.. 2020-21లో 0.2 బిలియన్ డాలర్లుగానే నమోదయ్యాయి.
- బ్యాంకుల ఆహారేతర రుణాల వృద్ధి.. మే 2021లో 5.9 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. అయితే వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాలు మాత్రం మే 2020లో 5.2 శాతం పెరగ్గా.. ఈ ఏడాది మే నెలలో 10.3 శాతం వృద్ధి చెందడం విశేషం.
ఇదీ చూడండి:సామాన్యుడికి షాక్- పాల ధరలు పెంపు