తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ మిలియనీర్ల దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా? - బిజినెస్ వార్తలు తెలుగు

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 4.47 కోట్ల మంది.. మిలియన్​ డాలర్లుకుపైగా సంపద కలిగి ఉన్నారు. 18.6 మిలియన్ల మందితో అమెరికా అగ్రస్థానంలో ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా 45 దేశాలకు కేటాయించిన ర్యాంకుల్లో భారత్​ 13వ స్థానంలో నిలిచింది.

ప్రపంచ మిలియనీర్లలో భారత్ స్థానం తెలుసా?

By

Published : Nov 3, 2019, 1:42 PM IST

Updated : Nov 3, 2019, 5:25 PM IST

ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. మిలియన్​ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి జాబితాలో ప్రస్తుతం మొత్తం 4.47 కోట్ల మంది ఉన్నట్లు 'సీఈఓవరల్డ్' నివేదికలో తేలింది. వీరిలో 1.86 కోట్ల మందితో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.

మిలియనీర్ల సంఖ్య ఆధారంగా 45 దేశాలకు 'సీఈఓవరల్డ్' మ్యాగజైన్ ర్యాంకులు ఇచ్చింది. 'క్రెడిడ్​ సూయిస్​ వార్షిక సంపద నివేదిక' ఆధారంగా ఈ ర్యాంకులు ఖారారు చేసింది.

ఇందులో 1.86 కోట్ల మంది మిలియనీర్లతో అమెరికా మొదటి ర్యాంకులో నిలిచించింది. 2018 ఒక్క ఏడాదిలోనే కొత్తగా 6,75,000 మంది మిలియనీర్లుగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియనీర్లలో 44 శాతం మంది అగ్రరాజ్యంలోనే ఉండటం విశేషం.

13వ స్థానంలో..

అమెరికా తర్వాత మిలియనీర్ల జాబితాలో 44 లక్షల మందితో చైనా రెండో స్థానంలో, 30 లక్షల మందితో జపాన్ మూడో స్థానంలో నిలిచాయి. భారత్​ 7,95,000 మందితో 13వ స్థానంలో ఉంది.

ముఖ్యంగా మిలియనీర్ల స్థిర, చరాస్తులు, ఇళ్ల విలువలను.. అప్పుల నుంచి తీసేసిన తర్వాత.. వారి సంపద విలువను లెక్కగట్టి జాబితాను రూపొందించారు.

ఇదీ చూడండి: ఇక మరింత స్పష్టంగా.. త్రీడీ హోలోగ్రామ్​లు

Last Updated : Nov 3, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details