తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్​లో భారత్@116

ప్రపంచవ్యాప్తంగా 174 దేశాలకు సంబంధించి.. వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్​లో భారత్​ 116 స్థానంలో నిలిచింది. ఆరోగ్యం, విద్య ప్రమాణాలు బేరీజు వేస్తూ 2020 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రూపొందించింది వరల్డ్ బ్యాంక్.

India Rank In Human Capital Index
ప్రపంచ బ్యాంక్ హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్

By

Published : Sep 17, 2020, 2:01 PM IST

ప్రపంచ బ్యాంక్ ఏటా రూపొందించే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్​లో భారత్ 116వ (మొత్తం 174 దేశాల్లో) స్థానంలో నిలిచింది. గత ఏడాది 157 దేశాల్లో భారత్ 115వ స్థానంలో ఉండటం గమనార్హం.

భారత్ స్కోరు మాత్రం 2018లో నమోదైన 0.44 నుంచి తాజా గణాంకాల్లో 0.49కి పెరిగింది.

మార్చి(కరోనా ముందు) వరకు 174 దేశాల ఆరోగ్యం, విద్యకు సంబంధించిన గణాంకాలతో 2020 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రూపొందించారు. ఇందులో తక్కువ ఆదాయం కలిగిన దేశాలు కీలక పురోగతి సాధించినట్లు గుర్తించారు.

అయినప్పటికీ ఆరోగ్యం, విద్యా పరంగా తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో పుట్టిన పిల్లలు 56 శాతం హ్యూమన్ క్యాపిటల్​​ను మాత్రమే సాధించగలిగినట్లు నివేదిక పేర్కొంది.

"కరోనా మహమ్మారి.. ఆరోగ్య సంరక్షణ, మనుగడ, పాఠశాలల్లో నమోదు సహా.. దశాబ్దపు హ్యుమన్ క్యాపిటల్ పురోగతిని ఆందోళనలో పడేసింది. మహిళలు, పేద కుటుంబాలపై ఆర్థికంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. చాలా మంది ఆహార సంక్షోభం, తీవ్ర పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉంది."

-డేవిడ్ మాల్పాస్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు

స్థిరమైన వృద్ధికోసం దేశాలు ప్రయత్నిస్తున్నందున.. రికవరీ, భవిష్యత్ వృద్ధి కోసం ప్రజలను రక్షించడం వారిపై పెట్టుబడులు పెట్టడం అవసరమని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది.

మహమ్మరి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరమైనట్లు నివేదిక తెలిపింది. దాదాపు విద్యా సంవత్సరంలో సగభాగం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు పేర్కొంది. కరోనా వల్ల మహిళలు, పిల్లలకు సంబంధించి అత్యవసరమైన ఆరోగ్య సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు వివరించింది. దీని కారణంగా కీలకమైన వ్యాక్సిన్​లకు పిల్లలు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో గేర్​ మార్చిన ఐటీ రంగం

ABOUT THE AUTHOR

...view details