అమెరికా దిగుమతులపై సుంకాల పెంపును భారత్ మరోసారి పొడిగించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై సుంకాల పెంపు నిర్ణయాన్ని మే 16కు బదులుగా జూన్ 16 నుంచి అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
2018 జూన్ నుంచి ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది భారత్.
సుంకాల పెంపు ఎందుకంటే..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుతూ అమెరికా గతేడాది నిర్ణయం తీసుకుంది.
దుకు ప్రతీకార చర్యగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బాదం, వాల్నట్స్ సహా 29 ఇతర ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పొడిగించాలని 2018 జూన్లో నిర్ణయించింది భారత్.
జీఎస్పీ అమలయ్యేనా?
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) కింద భారత్కు ఇస్తున్న ఎగుమతుల ప్రోత్సాహకాన్ని అమెరికా రెండు నెలల క్రితం ఉపసంహరించుకుంది. ఈ ప్రభావం భారత్ నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న 5.6 బిలియన్ డాలర్లు విలువైన వస్తువులపై పడింది.