సంఘటిత కార్మికుల భద్రత, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 'వన్ నేషన్, వన్ పే డే' పేరుతో నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గాంగ్వార్ తెలిపారు.
"సంఘటిత రంగాల్లో కార్మికులకు.. దేశ వ్యాప్తంగా ప్రతి నెల ఒకే తేదీని వేతన దినంగా నిర్ణయించనుంది కేంద్రం. ఈ చట్టం వీలైనంత త్వరగా ఆమోదం పొందాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారు. దీనితో పాటే కార్మికులకు రక్షణ, ఉత్తమ జీవనోపాధి కల్పించేందుకు ఒకే రకమైన కనీస వేతన నిబంధనను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. "