కరోనా సంక్షోభం వల్ల భారత్ బ్రాండ్ విలువ 20.8 శాతం తగ్గినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ 2 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో.. అత్యంత విలువైన దేశాల జాబితాలో 7వ స్థానాన్ని కొనసాగిస్తున్నట్లు 'బ్రాండ్ ఫినాన్స్' నివేదిక వెల్లడించింది.
కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్ - బ్రాండ్ విలువపై కరోనా ప్రభావం
బ్రాండ్ విలువ పరంగా 2 ట్రిలియన్ డాలర్లతో భారత్ ఈ ఏడాదీ 7వ స్థానంలో నిలిచిందని ఓ ప్రైవేటు సంస్థ నివేదిక పేర్కొంది. కరోనా కారణంగా బ్రాండ్ విలువ దాదాపు 21 శాతం తగ్గినప్పటికీ అదే ర్యాంక్‌లో కొనసాగటం గమనార్హం. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న దేశాల జాబితాలో.. అమెరికా 23.73 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక పేర్కొంది.
భారత్ బ్రాండ్ విలువ ఎంత
బ్రాండ్ ఫినాన్స్ నివేదికలోని మఖ్యాంశాలు..
- అమెరికా 23.73 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అత్యంత విలువైన దేశాల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కరోనా వల్ల అమెరికా బ్రాండ్ విలువ 14.5 శాతం తగ్గింది.
- చైనా 3.7 శాతం బ్రాండ్ విలువను కోల్పోయినా.. 18.76 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
- జపాన్ మాత్రం బ్రాండ్ విలువలో 6 శాతం కోల్పోయినప్పటికీ.. 4.26 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానానికి ఎగబాకింది.
- ఇంతకు ముందు మూడో స్థానంలో ఉన్న జర్మనీ 21.5 శాతం విలును కోల్పోవడం వల్ల.. 3.81 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 4వ స్థానంతో సరిపెట్టుకుంది.
- బ్రాండ్ విలువ పరంగా బ్రిటన్ 5, ఫ్రాన్స్, 6, కెనడా 8, ఇటలీ 9, దక్షిణ కొరియా 10 స్థానాల్లో ఉన్నాయి.
- కరోనా వల్ల టాప్ 10 దేశాల బ్రాండ్ విలువ సగటున 14 శాతం తగ్గింది.
- బ్రాండ్ విలువ పెరిగిన టాప్ 20 దేశాల్లో ఐర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం బ్రాండ్ విలువ కరోనా కాలంలోనూ 11 శాతం పెరిగి.. 670 బిలియన్ డాలర్లకు చేరింది.
- తయారీ రంగ హబ్‌గా ఎదుగుతున్న వియత్నాం బ్రాండ్ విలువ కూడా భారీగా 29 శాతం పెరిగింది.
- అర్జెంటీనా బ్రాండ్ విలువ అత్యధికంగా 57 శాతం తగ్గింది. వేగంగా బ్రాండ్ విలువ తగ్గిపోతున్న దేశాల జాబితాలో అర్జెంటీనా మొదటి స్థానంలో ఉంది. అమెరికా తర్వాత కరోనా సంక్రమణ రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇదే కావడం వల్ల బ్రాండ్ విలువ ఈ స్థాయిలో పడిపోతోంది.
- నేషన్ బ్రాండ్ పవర్ పరంగా.. జర్మనీ 100కు 84.9 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది. 83 స్కోర్‌తో బ్రిటన్ రెండో స్థానంలో నిలిచింది.
- టాప్ 100 దేశాల బ్రండ్ విలువ 2019లో 98 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే.. 2020లో 84.9 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది.
ఇదీ చూడండి:వృత్తి నిపుణుల్లో ఆదాయ వృద్ధిపై ఆశావాదం!