ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్.. కొన్ని ప్రాథమిక అంశాల పరిష్కరానికి కృషి చేసిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అయినప్పటికీ భారత్ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని వెల్లడించింది. ఐఎంఎఫ్ ఇటీవలే భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 6.1 శాతానికే పరిమితం చేయడం గమనార్హం.
పరిష్కారం లభించని వాటిలో ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక రంగాలు ఉన్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. అయితే భారత్ తీసుకున్న బ్యాంకుల విలీనం వంటి నిర్ణయాలతో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా అన్నారు. ప్రస్తుతం వృద్ధికి ఊతమందించే ధీర్ఘకాలిక అంశాలపై భారత్ దృష్టి సారించాలని పేర్కొన్నారు. మానవ వనరులపై పెట్టుబడులు ఎంతో అవసరమన్నారు.
ప్రతిభ గల మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు...