తెలంగాణ

telangana

ETV Bharat / business

పేదరికం నిర్మూలనలో భారత్ భేష్​: ప్రపంచ బ్యాంకు - BUSINESS NEWS IN TELUGU

పేదరికం నిర్మూలన, ఆర్థిక వృద్ధి విషయంలో భారత్​పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. రానున్న పదేళ్లలో భారత్​లో పేదరికం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే ఉద్యోగ కల్పన విషయంలో మాత్రం భారత్ మెరుగుపడాల్సిన అవసరముందని తెలిపింది.

ప్రపంచ బ్యాంకు

By

Published : Oct 16, 2019, 1:38 PM IST

పేదరికం నిర్మూలనలో భారత్​ ప్రయత్నాన్ని ప్రపంచ బ్యాంకు కొనియాడింది. 1990వ దశకం నుంచి దేశంలో పేదరికం సగానికి తగ్గినట్లు పేర్కొంది. ఆర్థిక వృద్ధి రేటు సగటున 7 శాతానికి పైగా నమోదవుతూ వస్తుందని తెలిపింది. ప్రపంచ వృద్ధిలోనూ భారత్​ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది.

గత 15 ఏళ్లలో మానవ అభివృద్ధిలోనూ భారత్‌ మెరుగుపడిందని ప్రపంచ బ్యాంకు ఉద్ఘాటించింది. భవిష్యత్​లో భారత్‌ వృద్ధి కొనసాగుతుందని.. మరో పదేళ్లలో పేదరికాన్ని దాదాపుగా నిర్మూలించవచ్చని అంచనా వేసింది. జనాభా అధికంగా ఉన్న భారత్‌.. వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల అవసరాన్ని గుర్తు చేసింది ప్రపంచ బ్యాంకు. 2030 సంవత్సరం నాటికి దేశ జీడీపీ 8.8 శాతం వృద్ధి చెంది, 343 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.

ఉద్యోగ కల్పన మెరుగుపడాలి...

నిరంతర వృద్ధిని కొనసాగించేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగ కల్పన మెరుగుపడాల్సిన అవసరముందని సూచించింది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏటా ఉద్యోగార్థుల సంఖ్య 13 మిలియన్లు పెరుగుతోంది. ఇదే సమయంలో 3 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టిమాత్రమే జరుగుతున్నట్లు పేర్కొంది.

మహిళా శ్రామిక శక్తి క్షీణత భారత్​కు మరో సవాలుగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. విద్యలో లింగ అంతరాన్ని అధిగమించినప్పటికీ.. అది 27 శాతంతో ప్రపంచలోనే అత్యల్ప స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ సంస్థల ఆధునీకరణ అవసరం..

భారత్​లో ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునీకరణ జరగాలని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మధ్య ఆదాయం కలిగిన వారికి సరిపోయే సేవలు అందించడానికి ఇది అవసరమని తెలిపింది. దీని ద్వారా జవాబుదారీతనం మెరుగుపడుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి: దివాళీకి బంగారం అమ్మకాలు అంతంతమాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details