తెలంగాణ

telangana

ETV Bharat / business

2020లో వృద్ధి ఎలా ఉండ‌బోతుంది? - 2020 లో భారత వృద్ధి, ద్రవ్యోల్బణం, బంగారం, సెన్సెక్స్ ఏలా ఉండబోతోంది.

2020లో భారత వృద్ధి ఎలా ఉండబోతుంది? ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థికం కల నెరవేరేందుకు ఈ ఏడాది ఎంతగా ఉపకరిస్తుంది. అసలు అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

india growth
2020 లో వృద్ధి ఎలా ఉండ‌బోతుంది?

By

Published : Jan 3, 2020, 7:01 AM IST

కొన్ని రంగాలు తిరిగి పుంజుకొని జీడీపీ వృద్ధికి దోహ‌దం చేస్తాయి. ఆహార‌, కీల‌క ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌వ‌చ్చు. అయితే కార్పొరేట్ వృద్ధితో జీడీపీ పెరిగే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ పాల‌సీల ఫ‌లితాలు వృద్ధికి స‌హ‌క‌రిస్తాయ‌ని కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థిక వేత్త‌, మ‌ద‌న్ స‌బ్న‌విస్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధి, 6 నుంచి 6.5 శాతం, సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 4 నుంచి 4.5 శాతం, బంగారం 1,500 నుంచి 1,550 డాల‌ర్లు ఔన్సుకి ఉండ‌వ‌చ్చ‌ని, అదేవిధంగా సెన్సెక్స్ 43,000 వ‌ర‌కు చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌భుత్వ చ‌ర్య‌లు, దేశంలో ఉన్న వృద్ధి అవ‌కాశాల వ‌ల‌న బీమాకు ఆద‌ర‌ణ పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అవకాశాలపై మేము సానుకూలంగా ఉన్నాము. జీవిత బీమా వ‌చ్చే రెండు, మూడేళ్లలో బీమా ప్రీమియంల‌ వృద్ధి 12-15 శాతానికి చేరుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఇండియా ఫస్ట్ లైప్ ఇన్సూరెన్స్ ఎండీ అండ్ సీఈఓ, ఆర్.ఎమ్ విశాఖ అన్నారు. ఇండియా ఫస్ట్ లైప్ ఇన్సూరెన్స్ ఎండీ అండ్ సీఈఓ, ఆర్.ఎమ్ విశాఖ అన్నారు. ఇక 2021 ఆర్థిక సంవ‌త్స‌రానికి జీడీపీ వృద్ధి 6.3 శాతం, సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 3.4 శాతం, బంగారం ధ‌ర‌లు ఔన్సుకి 1,600 డాల‌ర్లు, సెన్సెక్స్ 46,200 గా అంచ‌నా వేశారు.

ఇటీవల ఆరేళ్ల కనిష్టాన్ని6 శాతాన్ని తాకిన జిడిపి, వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రభుత్వ సంస్కరణలు కార్యరూపం దాల్చడంతో వృద్ధిని సాధిస్తుంది. పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆందోళన ప‌రిమితంగా ఉంటుంది, ఆర్‌బీఐ ల‌క్ష్యం లోపే సుమారు 4% వద్ద ఉంటుంది. మెరుగైన కార్పొరేటైజేషన్, ఏకీకరణ నేపథ్యంలో జాబితా చేయబడిన రియల్ ఎస్టేట్ కంపెనీలు బలప‌డ‌తాయ‌ని భావిస్తున్నాం. జీడీపీ వృద్ధి 6 శాతం, సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 4 శాతం గా అంచ‌నా వేశారు ఇండియా జేఎల్ఎల్ సీఈఓ ర‌మేశ్ నాయ‌ర్. బంగారం, సెన్సెక్స్ పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు .

2021 ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి సగం సవాలుగా కొనసాగుతుంది. తక్కువ పెట్టుబడి, వినియోగ డిమాండ్ మందగించడం వంటి రెండు సవాళ్లను ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కలిగి ఉంది. రెండ‌వ భాగంలో ఆర్థిక పునరుద్ధరణ న‌మోద‌వుతుంది. ద్రవ్యోల్బణం కూడా మొద‌టి రెండు త్రైమాసికాలు ఆర్‌బీఐ ల‌క్ష్యం 4% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, రెండవ భాగంలో తగ్గుతుందని కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్, శాంతి ఏకాంబ‌రం అన్నారు. జీడీపీ వృద్ధి 5.5 నుంచి 6 శాతం, సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 4.6 శాతం, బంగారం 1,480 నుంచి 1,750 వ‌ర‌కు, సెన్సెక్స్ 9 నుంచి 10 శాతం వృద్ధి చెంద‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ వ్యయం, గ్రామీణ వృద్ధి ద్వారా 2020 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి కోలుకుంటుంద‌ని ఆశిస్తున్నాము. పెట్టుబడిదారులకు గ‌త రెండేళ్ల కంటే వ‌చ్చే రెండేళ్లు భాగా లాభాల‌ను తెచ్చిప‌డితాయ‌ని స్వ‌రూప్ మోహంటి, మిరై అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజేర్స్ సీఈఓ అన్నారు. జీడీపీ వృద్ధి 5.5 శాతం నుంచి 6 శాతం, సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 3-4.5 శాతంగా అంచ‌నా వేశారు.

ఇదీ చూడండి : టిక్​టాక్​ పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం

ABOUT THE AUTHOR

...view details